భారతదేశం, నవంబర్ 28 -- Anil Ravipudi Announces His Dream Project With New Genre: టాలీవుడ్‌లో అపజయమెరుగని దర్శకుడిగా, సంక్రాంతి బాక్సాఫీస్ రారాజుగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి తన కెరీర్‌లో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఆయన, తొలిసారిగా పౌరాణిక (మైథాలజీ) జోనర్‌లోకి అడుగుపెడుతున్నారు.

గోవాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి అనిల్ రావిపూడి ఆసక్తికర ప్రకటన చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇఫ్ఫీ (IFFI) ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితమైంది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి రామాయణం ...