భారతదేశం, మే 27 -- Anil Ravipudi: తెలుగు సినిమా ప్రేక్షకులకు హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు ఎనర్జీని సమానంగా అందించే హీరో రామ్ పోతినేని, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నవ్వులు పూయించే హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి అనిల్ రావిపూడి, రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఎప్పుడో ఒక సినిమా రావాల్సింది. రవితేజ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ 'రాజా ది గ్రేట్' కథను అనిల్ రావిపూడి మొదటగా రామ్ కోసమే రాసుకున్నారట. ఆ కథను రామ్‌కు వినిపించడం కూడా జరిగింది.

అయితే అప్పటికే వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తుండటంతో, కాస్త విభిన్నంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్టును రామ్ సున్నితంగా తిరస్కరి...