భారతదేశం, మే 27 -- Anik Dutta: బెంగాలీ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బెంగాలీ దర్శకుడు అనిక్ దత్తా (Anik Dutta) బుధవారం (మే 27) మధ్యాహ్నం కోల్‌కతాలో కన్నుమూశారు. హిందుస్థాన్ పార్క్ ప్రాంతంలోని తన భార్య నివాస భవనం పైకప్పు పైనుంచి ఆయన కింద పడిపోయారు. వెంటనే ఆయన్ను ఢాకూరియాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన వయసు 66 ఏళ్లు.

ఘటనా స్థలానికి చేరుకున్న గరియాహట్ లోకల్ పోలీసులు, కోల్‌కతా పోలీసు హోమిసైడ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో పోలీసులకు ఒక ఆత్మహత్య లేఖ లభ్యమైంది. అందులో "నా మరణానికి నేనే బాధ్యుడిని, నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు" అని అనిక్ దత్తా రాసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

అంతేకాకుండా ఆయన జేబులో యాంటీ డిప్రెసెంట్ (...