భారతదేశం, జూలై 10 -- ANGRAU UG Admissions 2026 : గుంటూరు లోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) నుంచి యూజీ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు అండర్ గ్రాడ్యుయేట్ (UG) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారిక ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) స్టేట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు: ఎంపీసీ స్ట్రీమ్ రైతు కోటా (Farmers' Quota) కింద క్రింది కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. వీటికి ఏపీ ఈఏపీసెట్ 2026 రాష్ట్ర స్థాయి ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ పద్ధతిలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి పోస్ట్ ద్వారా గానీ లేదా నేరుగా అప్ల...