భారతదేశం, మార్చి 10 -- రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్‌ వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. ఈ అంశంపై గత కొంతకాలంగా కసరత్తు కొనసాగుతుండగా.. ఇందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు అందాయి. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా రాష్ట్రంలో నాలుగు రకాల గ్రామ పంచాయతీలు ఉండనున్నాయి.

గ్రామంలోని జనాభా, వచ్చే ఆదాయం ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను పునర్‌ వర్గీకరించారు. ఇప్పటివరకు 3 రకాల గ్రామపంచాయతీలు ఉండగా. ఇకపై నాలుగు రకాలు ఉండున్నాయి. కొత్తగా రూర్బన్‌ పంచాయతీ ఉండనుంది.

ఇప్పటికే పంచాయతీల పునర్విభజన కోసం కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ రాష్ట్రంలోని 13,351 పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజించింది. రూర్బన్‌, గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 పంచాయతీలుగా వర్గీకరించింది. ఇందులో భాగంగా అధిక జనాభా, ఆదాయం కలిగిన పలు గ్రామ పంచాయతీలను రూర్బన్‌ పం...