భారతదేశం, మార్చి 6 -- సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని వెల్లడించారు.

ఐటీ శాఖ మంత్రి సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడి తనంపై ఓ సిఫార్సు కూడా చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. 13 ఏళ్ల వయసు లోపు వారికి సోషల్‌ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామన్నారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని.. బానిసైతే జీవితాలు నాశనమవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....