భారతదేశం, జూన్ 23 -- Parawada Pharma City Fire Accident : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మాసిటీలో ఉన్న దక్షిణ ఎనర్జీ కంపెనీలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయిందని తెలుస్తోంది.

మృతి చెందిన ఇద్దరు కార్మికులను అచ్యుతాపురం వాసులుగా అధికారులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

పరవాడ ఫార్మా సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...