భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ) పరిశోధన, ఆధునిక సాంకేతిక వైపు వేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే రెండు మూడేళ్లలో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, అలాగే సెమీకండక్టర్ల విభాగాల్లో అత్యాధునిక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ప్రకటించారు.

విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల క్లస్టర్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన 'క్వాంటమ్-ఎన్‌హాన్స్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ఫర్ ఏఐ సిస్టమ్స్' (QUEST-AI) అనే మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.

శతాబ్ది ఉత్సవాల వేడుకలు విజయవంతంగా ముగిసిన అనంతరం, విశ్వవిద్యాలయంలో నాణ్యమైన అభివృద్ధి కార్యకలాపాలపై పూర్తి దృష్టి సారించామని వైస్-ఛాన్సలర్ తెలిపారు. ఈ సదస్సులో జరిగే ...