భారతదేశం, జూలై 22 -- Andhra Pradesh Covid Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ నమోదు కావడం ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మంగళవారం ఒక్క రోజే కొత్తగా 7 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజాగా వెలుగుచూసిన 7 కేసుల్లో గుంటూరు జిల్లా నుంచి నాలుగు, తూర్పు గోదావరి జిల్లా నుంచి రెండు, బాపట్ల జిల్లా నుంచి ఒక కేసు నమోదయ్యాయి. ఇక రాష్ట్రమంతటా నమోదు కాబడిన మొత్తం 26 కేసులలో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు వెలుగుచూశాయి.

వీటితో పాటు విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఎన్టీఆర్ మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకా...