భారతదేశం, జూలై 19 -- Bhogapuram International Airport : ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న 'భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రపంచ స్థాయి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఖరారు కావడంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా పూర్తి చేసింది. విమానాశ్రయ నిర్వహణకు అవసరమైన 8 కీలక చట్టబద్ధమైన అనుమతులు ఇప్పటికే లభించినట్లు నిర్మాణ సంస్థ జీఎంఆర్ (GMR) ప్రతిప్రతినిధులు, పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రార...