భారతదేశం, మే 25 -- Ananya Panday: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని గంటలుగా ఒక వీడియో క్లిప్ విపరీతంగా హల్చల్ చేస్తోంది. 'చాంద్ మేరా దిల్' మూవీలో హీరో లక్ష్య (Lakshya) ఎంతో ఆశ్చర్యంగా చూస్తుండగా.. నటి అనన్యా పాండే స్టేజ్ పైన భరతనాట్యం ఫ్యూజన్ డ్యాన్స్ ప్రదర్శిస్తుంది.

సినిమాలో హీరో ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిపోయినట్లు చూపించినప్పటికీ, బయట రియల్ లైఫ్‌లో మాత్రం నెటిజన్లు, ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్ ఆర్టిస్టులు ఈ సీన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో అనన్యా పాండే 'చాందిని' అనే పాత్రను పోషించింది. కథ ప్రకారం ఆమె ఒక భరతనాట్యం డ్యాన్సర్ (చారు శంకర్) కూతురు. అయితే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ సమయంలో సంప్రదాయ భరతనాట్యానికి బదులుగా.. ఆమె భరతనాట్యాన్ని హిప్-హాప్, లాకింగ్ స్టెప్పులతో మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ డ్యాన్స్ రూపంలో ప్రదర్శిస్త...