భారతదేశం, సెప్టెంబర్ 7 -- Amrutha Chowdary Comments In Tortoise Song Launch: రాజ్ తరుణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా టార్టాయిస్. ఈ సినిమాలో హీరోయిన్‌గా బ్యూటిఫుల్ అమృత చౌదరి చేసింది. వీరితోపాటు అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు.

రిత్విక్ కుమార్ దర్శకత్వం వహించిన టార్టాయిస్ సినిమాను ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మించారు. ఇటీవల టార్టాయిస్ సినిమా నుంచి నీ పరిచయం అనే సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ పాటను సింగర్ చిన్మయి శ్రీపాద ఆలపించగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రచించారు. రీసెంట్‌గా నీ పరిచయం సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ...