భారతదేశం, మార్చి 9 -- హైదరాబాద్‌ నగరంలోని చర్లపల్లి, తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనుంది. ఇటీవలనే రైల్వేశాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇప్పటికే రెండు అమృత్ భారత్ సర్వీసులు నడుస్తుండగా. ఈ కొత్త సర్వీస్ తో కలిపి వీటి సంఖ్య మూడుకు చేరనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నుంచి ముజఫర్‌పూర్‌, మరో ట్రైన్ తిరువనంతపురం మధ్య నడుస్తున్నాయి. తాజాగానే నాగర్‌కోయిల్ - చర్లపల్లి(హైదరాబాద్) మధ్య మరో ట్రైన్ ను రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఈ కొత్త సర్వీసుకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఈనెల 11వ తేదీ నుంచి ఈ ట్రైన్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....