భారతదేశం, మే 9 -- Ameesha Patel: బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి తరం హీరోయిన్లు, సినిమా పరిశ్రమలో పెరిగిపోతున్న 'ఫేక్ పీఆర్' (PR) సంస్కృతిపై ఆమె విరుచుకుపడ్డారు. బాక్సాఫీస్ వద్ద కనీస ప్రభావం చూపకపోయినా, తమను తాము సూపర్ స్టార్లమని ప్రచారం చేసుకోవడంపై అమీషా ఘాటుగా స్పందించారు.

శుక్రవారం (మే 8) రాత్రి ఎక్స్ వేదికగా అమీషా వరుస పోస్ట్‌లు చేశారు. కేవలం ఒకటి రెండు యావరేజ్ సినిమాల్లో నటించి, షూటింగ్ సెట్లలో ఉన్నంత మాత్రాన ఎవరూ స్టార్ అయిపోరని ఆమె తేల్చి చెప్పారు.

"మీ పీఆర్ టీమ్స్‌కు డబ్బులు ఇచ్చి నెంబర్ 1, నెంబర్ 2 అని పిలిపించుకుంటే సూపర్ స్టార్లు అయిపోరు. ఇది 2026.. ఈ రోజుల్లో 100 కోట్లు అనేది పెద్ద లెక్కే కాదు. కనీసం 200 కోట్ల వసూళ్లు సాధించిన ఒక్క సినిమా కూడా కెరీర్‌లో లేని నటీమణులు తమను తా...