భారతదేశం, నవంబర్ 15 -- Amazon Prime On Panchayat Season 5 OTT Streaming: భారతీయ ఓటీటీ రంగంలో సహజమైన కథనంతో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ 'పంచాయత్'. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ తమ అద్భుత నటనతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది మనసు గెలుచుకున్నారు.

మన తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూరి వాతావరణాన్ని, సర్పంచ్ ఎన్నికల హడావుడిని తలపించేలా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సిరీస్‌ను బాగా ఆదరించారు. అంతేకాకుండా ఇదే సిరీస్‌ను తెలుగులో సివరపల్లిగా ఓటీటీలోకి తీసుకొచ్చారు.

అయితే, ఇప్పుడు పంచాయత్ నుంచి సరికొత్తగా ఐదో సీజన్‌పై క్యూరియాసిటీ నెలకొంది. తెలుగు డబ్బింగ్‌లోనూ విపరీతమైన ఆదరణ పొందిన ఈ ఓటీటీ సిరీస్ ఐదో సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫులేరా గ్రామంలో ఈసారి ఎలాంటి రాజకీయ రగడ మొదలవుతుందో చూడాలని ఆరాటపడుతున్న ప్రేక్షక...