భారతదేశం, అక్టోబర్ 8 -- పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ బిగ్గెస్ట్ డిస్కౌంట్ వేడుక 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్‌ను అక్టోబర్​ 8న అధికారికంగా ప్రారంభించింది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి లేదా పాత డివైజ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల నుంచి బడ్జెట్ సెగ్మెంట్ మోడళ్ల వరకు ప్రధాన బ్రాండ్ల ఫోన్లపై భారీ ఆఫర్లను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ సేల్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఒకటిగా నిలిచింది. రూ. 1,29,999 ప్రారంభ ధరతో (12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యం) మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్, ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్‌లో కూపన్ ...