భారతదేశం, ఆగస్టు 10 -- Amaravati Seed Access Road : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలకమైన మైలురాయి ఆవిష్కృతమవుతోంది. ఈ నెల 13వ తేదీన సీఎం చేతుల మీదుగా.. రాజధాని ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (సబ్ ఆర్టీరియల్ E3 రోడ్డు)తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ), ఏపీ సీఆర్‌డీఏ మరియు గుంటూరు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేశాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైన నేపథ్యంలో సోమవారం అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీపార్థసారథి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్...