భారతదేశం, జూలై 3 -- Alpha Trolls: బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, శర్వరీ వాఘ్ లీడ్ రోల్స్ లో వైఆర్ఎఫ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' థియేటర్లలోకి వచ్చేసింది. కానీ రిలీజ్ రోజే ఆలియా, శర్వరీల హాట్ బికినీ సీన్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది.

ఈ భారీ ప్రాజెక్టుకు మొదటి షో నుంచే ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. వీటికి తోడుగా ఇప్పుడు ఈ లీకైన బికినీ సీక్వెన్స్ పై ఆడియన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) మేకర్స్ ను ఆడుకుంటున్నారు.

'ఆల్ఫా' మూవీలోని ఒక సీన్ లో ఆలియా, శర్వరీ ఇద్దరూ బికినీలు వేసుకుని ఒక పూల్ లో నుంచి బయటకు వస్తారు. ఈ సీన్ కు సంబంధించిన క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు యాక్టర్స...