భారతదేశం, మార్చి 1 -- మెగా, అల్లు కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యువ నటుడు అల్లు శిరీష్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు నయనిక రెడ్డితో మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది. ఈ క్రమంలో అల్లు వారి నివాసంలో వివాహ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాజాగా జరిగిన 'పెళ్లికొడుకు' వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు శిరీష్ తన నివాసంలో జరిగిన పెళ్లికొడుకు వేడుక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "నేను పెళ్లి చేసుకోబోతున్నాననే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది" అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. పూలతో ముస్తాబైన అల్లు నివాసంలో శాస్త్రోక్తంగా 'మంగళ స్నానాలు' నిర్వహించారు.

పసుపు, గంధంతో వరుడిని అలంకరించి, కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న శిరీష్‌ను...