భారతదేశం, మార్చి 3 -- సెలబ్రిటీ తారలు తరలివచ్చిన వేళ అల్లు స్టూడియోస్ వెలిగిపోయింది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్-నయనిక రెడ్డి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం (మార్చి 2) రాత్రి గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కు సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 6న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు శిరీష్-నయనిక పెళ్లి జరగబోతుంది. అంతకంటే ముందే సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల కోసం గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు తెలుగు, తమిళ, కన్నడ తదితర చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు భార్య అమలతో కలిసి అక్కినేని నాగార్జున, నందమూ...