భారతదేశం, మార్చి 7 -- తన ప్రేయసి నయనిక రెడ్డిని అల్లు శిరీష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల వెడ్డింగ్ మార్చి 6, 2026న అత్యంత సన్నిహితుల నడుమ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు అల్లు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అయ్యారు. పెళ్లి తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫస్ట్ పోస్టు షేర్ చేశాడు అల్లు శిరీష్. ఇందులో తన దివంగత మామను తలుచుకున్నాడు.

అల్లు శిరీష్ పోస్ట్

నయనిక రెడ్డి- అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ జంట మూడు ముళ్లతో ఒక్కటైంది. వెడ్డింగ్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు శిరీష్ తన ఫస్ట్ పోస్ట్ పెట్టాడు. పెళ్లి ఫొటోలను పంచుకున్నాడు. అలాగే తన భార్య నయనిక తండ్రి ఫొటోను కూడా అల్లు శిరీష్ షేర్ చేశాడు.

నా భార్యను పెంచినందుకు

''మా దివంగత మామ డి.శరత్ చంద్ర రెడ్డిని కలిసే అవకాశం నాకు దక్కలేదు. ఇప్పుడు నేను నా వైఫ్...