భారతదేశం, జూన్ 20 -- Allu Arjun Nampally Court: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు నాంపల్లి కోర్టు మరో షాక్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇప్పుడు ట్రేడ్, పబ్లిక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావల్సిందేనని, అల్లు అర్జున్ కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది.

నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ముంబైలో తన కొత్త ప్రాజెక్ట్ రాకా మూవీ షూటింగ్ షెడ్యూల్స్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని న్యాయస్థానం కొట్టిపారేసింది. "షూటింగ్ సాకులు చట్టం ముందు కుదరవు" అని స్పష్టం చేస్తూ సోమవారం కోర్టుకు స్వయంగా రావాలని ఆ...