భారతదేశం, నవంబర్ 21 -- Allu Arjun Arha: పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ గా మారింది. ఇవాళ (నవంబర్ 21) తన గారాలపట్టి అల్లు అర్హ 10వ పుట్టినరోజు సందర్భంగా ఆయన షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన కూతురితో కలిసి ఉన్న ఓ అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పంచుకున్నారు అల్లు అర్జున్. "హ్యాపీ బర్త్‌డే టు ది జాయ్ ఆఫ్ మై లైఫ్" (నా జీవితంలోని ఆనందం నువ్వే) అంటూ ప్రేమపూర్వక సందేశాన్ని జోడించారు. ఒక స్టార్ హీరోగా కాకుండా ఓ సాధారణ తండ్రిగా కూతురిపై ఆయన చూపిన ఆప్యాయత నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

అర్హ పదో పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరుపుకునేందుకు అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి శ్రీలంకకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి...