భారతదేశం, జూన్ 22 -- Allu Arjun: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాదకర తొక్కిసలాట కేసులో సోమవారం (జూన్ 22) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణకు సంబంధించి నాంపల్లి క్రిమినల్ కోర్టు ఎదుట సినీ నటుడు అల్లు అర్జున్ నేరుగా హాజరుకాలేదు.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో వ్యక్తిగతంగా అటెండ్ కావాలని అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఆయన ముంబైలో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని, అందుకే వ్యక్తిగతంగా రాలేకపోయారని బన్నీ తరఫు న్యాయవాదుల బృందం (లీగల్ టీమ్) న్యాయస్థానానికి వివరించింది.

"ఈరోజు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ముంబైలో సినిమా షూటింగ్ జరుగుతున్నందున అల్లు అర్జున్ ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి...