భారతదేశం, ఆగస్టు 10 -- Allu Arjun: ప్రతి హీరోకు ఓ బ్రేక్ వస్తుంది. ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ తో జీవితమే మారిపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కూడా పుష్ప సినిమాలతో ఆ రేంజ్ టర్నింగ్ పాయింట్ దక్కింది. గంగోత్రితో ప్రారంభించిన అల్లు అర్జున్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు.

ఓ వైపు నటుడిగా అదరగొడుతూనే థియేటర్ బిజినెస్ లోనూ అల్లు అర్జున్ దూసుకెళ్తున్నాడు. హైదరాబాద్ లో ఇప్పటికే అల్లు సినిమాస్ థియేటర్ పాపులర్ అయింది. ఇప్పుడు ఆ ఏఏఏ సినిమాస్ థియేటర్ ను వైజాగ్ లో స్టార్ట్ చేశారు. ఆదివారం (ఆగస్టు 9) జరిగిన ఈ థియేటర్ ఓపెనింగ్ సెర్మనీకి అల్లు అర్జున్ స్వయంగా వెళ్లాడు.

అల్లు సినిమాస్ ఓపెనింగ్ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ''గంగోత్రి సినిమా సమయంలో వైజాగ్ రోడ్లపై తిరిగేవాణ్ని. కానీ ఎవరూ గుర్తు పట్టేవాళ్లు కాదు. క...