భారతదేశం, నవంబర్ 16 -- Allu Arjun: పుష్ప సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన అల్లు అర్జున్ చేస్తున్న నెక్స్ట్ మూవీ 'రాకా'. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీని తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, అల్లు అర్జున్ లుక్ తో రాకాపై హైప్ భారీగా పెరిగిపోయింది.

తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఆకాశంలో ఒక తార' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఆదివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాకా మూవీ గురించి ఐకాన్ స్టార్ అప్‌డేట్ ఇచ్చారు.

అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగా ఫ్యాన్స్ రాకా అని అరిచారు. దీనిపై బన్నీ రియాక్టయ్యారు. ''కచ్చితంగా త్వరలో రాకా అప్‌డేట్ ఇస్తాం. నాకు తెలుసు చాలా లేట్ అవుతోంది. కానీ ఇచ్చేటప్పుడు బెస్ట్ ఇవ్వాలి. దాని గురించి డిస్కషన్ ఉండకూడదు....