భారతదేశం, మార్చి 6 -- అల్లు వారి ఇంట నేడు పండుగ వాతావరణం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ఒక్కటై నేటితో (మార్చి 6) 15 వసంతాలు పూర్తయ్యాయి.

సరిగ్గా ఇదే రోజున (మార్చి 6) అన్న అల్లు అర్జున్ లాగే తమ్ముడు అల్లు శిరీష్ తన చిరకాల ప్రేయసి నయనిక రెడ్డితో ఏడడుగులు వేస్తుండటం విశేషం. తమ్ముడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, బన్నీ తన ప్రియమైన భార్య స్నేహా రెడ్డికి సోషల్ మీడియా వేదికగా అత్యంత ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహా రెడ్డితో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను పంచుకున్నారు. అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా నలుపు రంగు సూట్‌లో బన్నీ, బ్లూ సీక్విన్ డ్రెస్‌లో స్నేహా మెరిసిపోతున్న ఫోటోను షేర్ చేస్తూ.. "హ్య...