భారతదేశం, జూలై 27 -- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'AA23' నుంచి ఒక ఊహించని న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించబోతుందంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో అసలు హీరోయిన్ పాత్రకే స్థానం లేదని తెలుస్తోంది.

స్టోరీ లైన్‌ను ఏమాత్రం డైవర్ట్ చేయకుండా, పక్కా గ్రిప్పింగ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లో మెయిన్ హీరోయిన్ రోల్ ఉండే అవకాశం దాదాపు లేదని సమాచారం.

కథ చెప్పే తీరులోనే కాకుండా క్యారెక్టర్లను డిజైన్ చేయడంలోనూ లోకేష్ కనగరాజ్ రూటే సపర...