భారతదేశం, నవంబర్ 27 -- Allu Aravind Pan India: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తన సుదీర్ఘ సినీ అనుభవంతో ఎప్పుడూ ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. తాజాగా ఆయన సమర్పణలో, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశంలో ఒక తార'. నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఈ సందర్భంగా గురువారం (నవంబర్ 26) హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ కమర్షియల్ సినిమాలు, పాన్-ఇండియా ట్రెండ్, తన కుమారుడు అల్లు అర్జున్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రెస్ మీట్‌లో ఓ విలేకరి అల్లు అరవింద్‌ను ఉద్దేశిస్తూ.. "ప్రస్తుతం తెలుగు అగ్ర హీరోలందరూ భార...