alla nani passed away : గుండెపోటుతో మాజీ మంత్రి ఆళ్ల నాని మృతి
భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది. మాజీ వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు మాజీ శాసనసభ్యుడు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆయన గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్తితి చేయి దాటిపోయింది. ఆళ్ల నాని తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు దృవీకరించారు. ఆయన అకాల మరణం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆళ్ల నాని తనదైన ముద్ర వేశారు. ప్రజలతో నిరంతరం మమేకమయ్యే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఏలూరు నియోజకవర్గం నుంచి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.