భారతదేశం, అక్టోబర్ 9 -- Alias Rukmini: వరుస బాక్సాఫీస్ ఫలితాలతో ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో నితిన్, తన తదుపరి చిత్రం 'అలియాస్ రుక్మిణి' (Alias Rukmini) తో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తుండటంతో మొదటి నుంచి దీనిపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

బాక్సాఫీస్ వద్ద గట్టి విజయం కోసం చూస్తున్న నితిన్.. ఈ సారి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ డ్రామాతో ముందుకు వస్తున్నారు. 'అలియాస్ రుక్మిణి' చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ఇవాళ (అక్టోబర్ 9) అనౌన్స్ చేశారు.

ఇవాళ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ అలియాస్ రుక్మిణి సినిమా విడుదల తేదీ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో నితిన్ సగటు మధ్యతరగతి యువకుడిలా కనిపించి ఆకట్టుకున్నారు. సాధారణం...