భారతదేశం, జూలై 2 -- Alia Bhatt Counter To Student Says Gareeb Aadmi Alpha: బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ సమయస్ఫూర్తికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. తను నటించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) ప్రమోషన్స్ కోసం రాజస్థాన్ వెళ్లిన అలియా, అక్కడ ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా క్రేజీ స్టైల్‌ను ఫాలో అవుతూ అలియా ఇచ్చిన కౌంటర్‌తో స్టేజ్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. రాజస్థాన్‌లోని జేఈసీఆర్‌సీ (JECRC) ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులతో అలియా భట్ ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఓ స్టూడెంట్ ఆలియాను మైక్‌లో ఒక ప్రశ్న అడిగారు. "సోషల్ మీడియాలో ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నడిచే 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోకి వెళ్లడానికి మీ మేనేజ్‌మెంట్, మీరు ఎలా ఒప్పుకున్నారు?" అని ...