భారతదేశం, మే 15 -- Alia Bhatt Workout And Diet Before Cannes 2026: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 79వ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో (Cannes 2026) భారతీయ తారల సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.

అయితే, రెడ్ కార్పెట్‌పై అలియా భట్ ధరిస్తున్న ఖరీదైన డిజైనర్ డ్రెస్సుల కంటే, వాటిని మోయడానికి ఆమె సిద్ధం చేసిన 'శరీర సౌష్టవం' వెనుక ఉన్న శ్రమ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ఫిట్‌నెస్ వెనుక ఉన్న అలియా భట్ పక్కా ప్లానింగ్‌ను ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ కరణ్ సాహ్నీ బయటపెట్టారు.

అలియా భట్ తన శరీరాన్ని మార్చుకోడానికి ఎంత కష్టపడుతుందో తెలిపే ఒక వీడియోను కరణ్ సాహ్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "కేన్స్ కోసం అలియా సిద్ధమవుతోంది...