భారతదేశం, జూన్ 30 -- Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ స్క్రీన్ మీద ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్స్ కొట్టినా, వందల కోట్లు వసూలు చేసినా ఇంట్లో మాత్రం వాళ్ల ఆటలు సాగడం లేదు. తన అప్‌కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆలియా భట్.. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక క్రేజీ సీక్రెట్‌ను బయటపెట్టింది.

థియేటర్లలో రణబీర్ కపూర్ 'యానిమల్' లాగా ఊచకోత కోసినా, తాను 'ఆల్ఫా' లాగా ఎంత పవర్‌ఫుల్ రోల్స్ చేసినా.. ఇంట్లో మాత్రం వీళ్లద్దరినీ శాసించే అసలైన బాస్ వేరే ప్రొడక్ట్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.

యూట్యూబర్ 'మైమిస్ ఆనంద్' (MyMissAnand)తో మాట్లాడిన ఆలియా భట్, తన ముద్దుల కూతురు రాహా కపూర్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. యాంకర్ సరదాగా అడుగుతూ.. "బయట రణబీర్ కపూర్ యానిమల్, నువ్వు ఆల్ఫా కదా.. మరి ఇంట్లో ఎవరు బాస్...