భారతదేశం, ఫిబ్రవరి 28 -- గ్లోబల్ వేదికలపై మన తారలు మెరిసినప్పుడు ప్రశంసలతో పాటు కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదురవుతుంటాయి. రీసెంట్‌గా జరిగిన బాఫ్టా 2026 అవార్డుల వేడుకలో తన అందంతో మెస్మరైజ్ చేసిన అలియా భట్ ఓ సినిమాపై చేసిన కామెంట్లతో ట్రోలింగ్‌కు గురైంది.

ఈ అవార్డు వేడుకల్లో ప్రజెంటర్‌గా అలరించిన అలియా భట్ ఒక ఇంటర్వ్యూలో 'గాన్ గర్ల్' సినిమా గురించి మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఈ విషయంపై బాఫ్టా అలియా తన మనసు విప్పారు.

బాఫ్టా 2026 రెడ్ కార్పెట్ మీద ఒక ఇంటర్వ్యూయర్ అలియాను పలకరిస్తూ.. "మీకు బాగా నచ్చిన సినిమా ట్విస్ట్ ఏది?" అని అడిగారు. అలియా భట్ కాస్త తడబడుతూ 'గాన్ గర్ల్' సినిమా పేరు చెప్పారు. ఆ సమయంలో అలియా భట్ ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్ చూసి.. అసలు ఆమె ఆ సినిమా చూశారా? లేదా కావాలనే ఇంటర్నేషనల్ స్టార్‌లా ...