భారతదేశం, మే 8 -- Akshay Kumar Eye Surgery: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దృష్టి లోపాలను సరిదిద్దుకునేందుకు (Vision Correction) ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ కోలుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అక్షయ్ కుమార్, తన తాజా చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేసిన వెంటనే కంటి సర్జరీకి వెళ్లారు. మే 6, బుధవారం ఉదయం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ మైనర్ ఆపరేషన్ జరిగినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

కొన్నాళ్ల పాటు లైట్ల వెలుతురుకు దూరంగా, ప్రశాంతంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. మన దగ్గర కూడా ఎన్టీఆర్, నాగార్జున వంటి స్టార్ హీరోలు గతంలో ఇలాంటి కంటి చికిత్సలు చేయించుకున్న సందర...