భారతదేశం, జూలై 25 -- Akkineni Akhil: తెలుగు సినీ లవర్స్ కు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు 'సిసింద్రీ' ఒక మరచిపోలేని మధుర జ్ఞాపకం. 1995లో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, అందులోని పాటలు నాటి తరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సిసింద్రీ 2 హాట్ టాపిక్ గా మారింది. అందుకు అఖిల్ కామెంట్స్ కారణం.

సిసింద్రీ సినిమాలో ఏడాది వయసున్న పసిపాపగా కెమెరా ముందుకు వచ్చి తన అమాయకత్వంతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లీడ్ రోల్‌లో అలరించాడు అఖిల్ అక్కినేని, ప్రస్తుతం హీరోగా ఈ అక్కినేని వారసుడు టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా క్లాసిక్ మూవీ సిసింద్రీ సీక్వెల్‌పై అఖిల్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

తన కెరీర్‌లోనే కాకుండా అక్కినేని కాంపౌండ్‌లో మైలురాయిగా నిలిచిన 'సిసింద్రీ' ...