భారతదేశం, అక్టోబర్ 22 -- Akka Trailer: కీర్తి సురేష్ మరో బోల్డ్ అవతార్ లో కనిపిస్తున్న వెబ్ సిరీస్ అక్క. ఈ నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ కాగా.. తాజాగా గురువారం (అక్టోబర్ 22) మేకర్స్ ఓ ఇంటెన్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పేర్నూరు అనే ప్రాంతం కోసం జరిగే ఫైట్ ఇందులో చూడొచ్చు.

కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్క ట్రైలర్ మొదట్లోనే పేర్నూరు అనే ప్రాంతం గురించి పరిచయం చేశారు. 1985 ప్రాంతంలో జరిగిన స్టోరీగా చూపించారు. ఇక్కడ 800 ఏళ్లుగా ఆడాళ్లదే రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని పాలించే వ్యక్తిని అక్క అని పిలుస్తుంటారు. భవాని (కీర్తి సురేష్) నేతృత్వంలో ఆ రాజ్యం నడుస్తుంటుంది. ఆడాళ్లు ఇంటినే కాదు వ్యాపారాన...