భారతదేశం, జూన్ 30 -- Akhil Raj: 'రాజు వెడ్స్ రాంభాయ్' సినిమాతో రీసెంట్‌గా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ యాక్టర్ అఖిల్ రాజ్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవకు దిగిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో అఖిల్ రాజ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడంపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వివాదం బాగా ముదరడంతో తాజాగా అఖిల్ రాజ్ ఒక ఎమోషనల్ క్లారిఫికేషన్ వీడియో రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో క్లియర్ కట్‌గా వివరించాడు.

అఖిల్ రాజ్ మంగళవారం (జూన్ 30) ఓ వీడియోను రిలీజ్ చేశాడు. సుమారు 8 నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అసలు గొడవకు కారణమేంటో అతడ వివరించాడు.

"మేము అసలు ఆ రోజు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేయలేదు. కానీ ఒక డెలివరీ బాయ్ మా ఇంటికి పార్సిల్ తెచ్చాడు. మా అమ్మ ఆ పార్సిల్ తీసుకుని ఇది ఎవరు ఆర్డర్ చేశారు అని అడిగింది. ఇంట్లో ఎవరూ ఆ...