భారతదేశం, జూలై 2 -- Akhil Accident: అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ కు ఒక రేంజ్ లో షాక్ ఇచ్చే న్యూస్ బయటపడింది. 'ఏజెంట్' మూవీ డిజాస్టర్ తర్వాత అఖిల్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నాడు అని తెగ ఫీల్ అయిన ఫ్యాన్స్ కు ఇప్పుడు అసలు నిజం తెలిసింది. భారీ అంచనాలతో వస్తున్న అఖిల్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) వచ్చే వారం థియేటర్లలోకి రాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన అఖిల్.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లాంగ్ బ్రేక్ వెనుక ఉన్న చేదు నిజాన్ని రివీల్ చేశాడు. గత 16 నెలలుగా తాను అనుభవించిన నరకం గురించి చెబుతూ అందరినీ ఎమోషనల్ చేశాడు. నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు ఇప్పటివరకు సరైన బ్లాక్ బస్టర్ పడలేదు.

అఖిల్ నటించిన 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' పర్వాలేదు అ...