భారతదేశం, జూలై 5 -- Akhil: అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఇప్పటివరకూ ఓ బంపర్ హిట్ దక్కలేదు. హీరోగా తనను తాను ఎస్టాబ్లిస్ చేసుకునేందుకు అవసరమైన సక్సెస్ రాలేదు. ఈ నేపథ్యంలో తనకు హిట్ అందిస్తుందని 'లెనిన్' మూవీని నమ్ముకున్నాడు అఖిల్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను మాట్లాడుతూ.. ముఖం చూపించలేకపోతున్నానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం (జూలై 5) లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో అఖిల్ మాట్లాడుతూ.. ''గ్యాప్ వచ్చేసింది. మొన్న వైజాగ్ లో సారీ చెప్పా. ఇప్పుడూ సారీ చెప్తున్నా. నా మైండ్ లో ఎంతో బాధగా ఉంది'' అని అన్నాడు.

''రెండున్నరేళ్ల పాటు మీతో కమ్యునికేట్ చేయలేకపోతున్నా. నా ముఖం చూపించలేకపోతున్నా. ఈ రోజు పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చా. ఆ మైండ్ సె...