భారతదేశం, అక్టోబర్ 23 -- Venkatesh Trivikram Aadarsha Kutumbam Trailer Released: టాలీవుడ్ ప్రేక్షకులకు కుటుంబ కథా చిత్రాలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే కాంబినేషన్లలో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల జోడీ ఒకటి. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాల తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు వీరిద్దరి కాంబో మళ్లీ పట్టాలెక్కింది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మాణంలో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' చిత్రంపై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేసేలా ఇవాళ ఆదర్శ కుటుంబం ట్రైలర్ విడుదలైంది. ఈ ఏకే 47 ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

ఆదర్శ కుటుంబం ట్రైలర్‌ను పరిశీలిస్తే, కేవలం సాధారణ కుటుంబ కథ మాత్రమే కాకుండా అందు...