భారతదేశం, జూలై 29 -- Adarsha Kutumbam AK47: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47). ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విడుదల చేసిన గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అచ్చు అనిల్ రావిపూడి- వెంకటేష్ సినిమాలా ఉందే అనే ట్రోల్స్ వస్తున్నాయి.

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం నుంచి వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే వింటేజ్ వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాటల మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఈ గ్లింప్స్ చూశాక దర్శకుడు అనిల్ రావిపూడి కాన్సెప్ట్ ఫ్రస్ట్రేషన్ కామెడీ శైలి గుర్తుకొస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఆదర్శ కుటుంబం చిత్రం నుం...