భారతదేశం, జూలై 23 -- Aishwarya Rajesh: పాన్-ఇండియా రేంజ్‌లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న వెర్సటైల్ నటి ఐశ్వర్య రాజేష్.. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై తనకు ఉన్న అమితమైన ఇష్టాన్ని బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. సుశాంత్ అంటే తనకు ఎంత పిచ్చి క్రష్ ఉందో చెప్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయన నటించిన సినిమాలు చూసి తాను ఫిదా అయ్యానని, ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐశ్వర్య రాజేష్ తన ఇంటర్వ్యూలో సుశాంత్ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. "పవిత్ర రిష్తా" సీరియల్ రోజుల నుంచే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తనను ఆకట్టుకుందని చెప్పారు. ఆ తర్వాత 'కై పో చే', 'ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాల్లో ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసి తాను పూర్తిగా పడిపోయానని వెల్లడించారు.

ప్రతి పాత్రలోన...