భారతదేశం, ఆగస్టు 18 -- Aishwarya Rajesh About Fish Curry Bill 18 Lakh: దివంగత నటుడు రాజేష్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. రాంబంటుతో తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ కౌసల్య కృష్ణమూర్తి, మిస్‌మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ వంటి సినిమాలతో అలరించింది.

అయితే, ఆ సినిమాలు ఏవి ఐశ్వర్య రాజేష్‌ను హీరోయిన్‌గా బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాయి. కానీ, 2025లో వచ్చిన వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్య రాజేష్.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యంగా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయిన ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది. ఇప్పటికే ఓ సుకుమారి సినిమాతో అలరించిన ఐశ్వ...