భారతదేశం, ఆగస్టు 28 -- Aishwarya Rai Rakhi: బాలీవుడ్ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు సొంత అన్నయ్య ఆదిత్య రాయ్ ఉన్నప్పటికీ.. ఆమె ప్రతీ ఏటా రాఖీ పౌర్ణమి వేళ ఓ స్టార్ హీరోకి నిష్టగా రాఖీ కడుతుంటారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సెట్స్‌లో మొదలైన ఈ అరుదైన అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ హీరో ఎవరో కాదు.. పాన్-ఇండియా వ్యాప్తంగా 'రియల్ హీరో'గా పేరుతెచ్చుకున్న సోనూ సూద్.

2008లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం 'జోధా అక్బర్' (Jodhaa Akbar) సెట్స్‌లో ఈ ఇద్దరి బంధం మొదలైంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ అక్బర్ పాత్ర చేయగా, ఐశ్వర్య రాయ్ 'జోధా బాయి'గా, సోనూ సూద్ ఆమె సోదరుడు 'సుజామల్' పాత్రలో నటించారు.

ఈ పీరియాడిక్ ఎపిక్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రాఖీ పండుగ రావడంతో.. ఐశ్వర్య రాయ్ స్వయంగా సో...