భారతదేశం, నవంబర్ 12 -- పెరుగుతున్న వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణంగా కాలుష్యం అనగానే ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఆయాసం మాత్రమే గుర్తుకొస్తాయి. అయితే, విషపూరిత గాలి ఊపిరితిత్తులనే కాకుండా నేరుగా గుండెను పిండేస్తుందని, ఉన్నట్టుండి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ దిల్లీ నుంచి మొదలుకొని హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పడిపోతోంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం గుండె వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందో దిల్లీ సి.కె. బిర్లా హాస్పిటల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ అంశుల్ కుమార్ జైన్ వివరించారు.

"మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలిలోని అతి సూక్ష్మమైన పీఎం2.5 రేణువులు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరుకుంటాయి. కొన్ని సంద...