భారతదేశం, మార్చి 21 -- కెనడాలోని వాంకోవర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులకు అది ఎక్కడికీ వెళ్లని ప్రయాణంగా మిగిలిపోయింది! కెనడాలోకి ప్రవేశించడానికి అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్ లేని విమానాన్ని ఎయిర్ ఇండియా పొరపాటున పంపడంతో.. దాదాపు ఎనిమిది గంటల పాటు గాలిలో ప్రయాణించిన తర్వాత ఆ విమానం తిరిగి దిల్లీకి వచ్చేసింది.

ఏఐ185 విమానం గురువారం ఉదయం 11:34 గంటలకు ప్రయాణికులతో దిల్లీ నుంచి బయలుదేరింది. తొలుత తూర్పు దిశగా ప్రయాణాన్ని కొనసాగించింది. అయితే, సుమారు నాలుగు గంటల ప్రయాణం తర్వాత, విమానం కున్మింగ్ సమీపంలోని చైనా గగనతలంలోకి ప్రవేశించింది. సరిగ్గా ఆ సమయంలోనే సదరు విమానానికి కెనడాలో కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతి లేదనే విషయాన్ని ఎయిర్ ఇండియా గుర్తించింది.

వెనువెంటనే విమానాన్ని వెనక్కి పిలిపించడంతో, ప్రయాణం మొదలైన చోటికే తిరిగి ...