భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాన్ని భారత్ ముందుండి నడిపిస్తోందని, "అందరి ఆనందం.. అందరి సంక్షేమం" అనేదే ఈ సాంకేతికతలో మన దేశం నిర్దేశించుకున్న ప్రమాణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దిల్లీలోని భారత్​ మండపంలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' నాలుగో రోజున ఆయన ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి, భారీ టెక్ టాలెంట్, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ కలిగిన భారత్ నేడు ప్రపంచానికి దిక్సూచిగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఈవెంట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఫ్సాన్స్​ అధ్యక్షుడు మ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ సహా అనేక మంది నేతలు, టెక్​ లీడర్లు పాల్గొన్నారు.

మానవ నాగరికత గమనాన్ని మార్చేసే కొన్ని కీలక మలుపులు చరిత్రలో ఉంటాయని, ఏఐ అటువంటి ఒక గొప్ప పరివర్తన...