భారతదేశం, జూలై 22 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు ప్రపంచ ఉద్యోగ మార్కెట్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు విదేశాల్లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోర్సుల ఎంపికపై స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య అనగానే పరుగులెత్తిన సంప్రదాయ MBA డిగ్రీల స్థానంలో.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

ఐఐఈ ఓపెన్ డోర్స్ (IIE Open Doors) తాజా గణాంకాల ప్రకారం, 2024/25 విద్యాసంవత్సరంలో అమెరికా వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 57 శాతం మంది 'స్టెమ్' (STEM) కోర్సులనే ఎంచుకున్నారు. ఇందులో మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ వాటా 26 శాతం కాగా, ఇంజనీరింగ్ 18 శాతంగా నమోదు కావడం విశేషం.

అమెరికాకు అత్యధిక సంఖ్యలో విద్యార్థులను పంపుతున్...